హైదరాబాద్ః తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడమంటే కోరి కష్టాలను తెచ్చుకోవడమేనని కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరావు, వైఎస్ రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా వాటర్ చార్జీలు, కరెంట్ చార్జీలు, రెజిస్ట్రేషన్ చార్జీలు ఖాయంగా పెంచుతుందని ప్రజల నెత్తిన మరింత భారం మోపుతుందని ఎంఎస్ అన్నారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే తెలుగుదేశం దూకుడుకు అడ్డుకట్టవేయడానికి అవకాశం వుంటుందని ఆయన ప్రజలకు తెలియజేశారు. సిఎల్పి నేత వైఎస్ చంద్రబాబు చెబుతున్న అభివృద్ధిని ప్రశ్నిస్తూ గురువారం నాడు ఒక ప్రశ్నావళిని విడుదల చేశారు. మొత్తం పదిహేను ప్రశ్నలతో ఈ ప్రశ్నావళిని విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కరెంట్ చార్జీలు పెంచుతారా లేదా విస్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకుకు దాసోహం అని ప్రజలను నానా హింసలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.