• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రజలను మోసం చేస్తున్న బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కిరోసిన్‌, వంటగ్యాస్‌ ధరల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని పిసిసి నేత ఎం సత్యనారాయణరావు విమర్శించారు. వాటర్‌ చార్జీలు, కరెంట్‌ చార్జీలతో సహా అన్ని రకాల సరుకుల ధరలు పెరిగి ప్రజలకు బతుకు భారం కావడానికి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కిరోసిన్‌, గ్యాస్‌ ధరలు పెంచనున్నట్టుగా కేంద్రం ప్రకటిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకటనలు నమ్మవద్దని తాను కేంద్రంతో మాట్లాడి ధరలు పెరగకుండా చూస్తానని హామీ ఇస్తున్నారని ప్రజలు ఎవరి మాటలను నమ్మాలని గాంధీభవన్‌లో జరిగిన మరో సమావేశంలో పిసిసి ప్రతినిధులు రోశయ్యం, శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీలను కట్టిపెట్టి ఎట్టిపరిస్థితిలోనూ వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధర పెంచకుండా అడ్డుకుంటానని చంద్రబాబు ప్రజలకు విస్పష్టంగా హామీ ఇవ్వగలరా అని వారు ప్రశ్నించారు. గతంలో విద్యుత్‌ చార్జీల విషయంలోనూ, గ్యాస్‌ ధరల విషయంలోనూ ప్రజలను చంద్రబాబు మోసగించారని పిసిసి నేతలు ఆరోపించారు. శుక్రవారం నాడు నగరంలో నిర్వహించిన ప్రచారంలో ఈ ధరల పెంపు, విద్యత్‌ చార్జీలపైనే కాంగ్రెస్‌ ఎక్కువగా దృష్టి సారించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X