వాషింగ్టన్ః
భారత-పాక్
దేశాల
మధ్య
ఉద్రిక్తల
నివారణకు
అమెరికా
కృషి
కొనసాగిస్తుందని
అమెరికా
అధ్యక్షుడు
బుష్
వెల్లడించారు.
ఉగ్రవాదులను
అణచి
వేసేందుకు
పాకిస్తాన్
భేషైన
చర్యలు
తీసుకుంటుందని
ఆయన
అన్నారు.
అమెరికన్
కాంగ్రెస్
ఉభయ
సభలను
ఉద్దేశించి
చేసిన
ప్రసంగంలో
బుష్
పాకిస్తాన్
అధ్యక్షుడు
ముషారఫ్
పై
ప్రశంసల
జల్లు
కురిపించారు.
బుష్
ముషారఫ్
ను
ప్రశంసించిన
ప్రతిసారీ
ఉభయసభలకు
చెందిన
వందలాదిసెనెటర్లు
కరతాళధ్వనులు
చేసి
హర్షం
వ్యక్తం
చేశారు.
ముషారఫ్
సారధ్యంలో
పాకిస్తాన్
ఎంతగానో
పురోగమిస్తున్నదని
బుష్
అన్నారు.
పాకిస్తాన్
ను
ముషారఫ్
అభివృద్ధిపథంలో
నడుపుతున్నారని
ఆయన
ప్రశంసించారు.
అయితే
ప్రపంచవ్యాప్తంగా
తీవ్రవాదం
ఎక్కడ
వున్నా
అమెరికా
దాన్ని
నిర్మూలిస్తుందని
అన్నారు.
కొన్ని
దేశాలు
ఉగ్రవాద
నిర్మూలనవిషయంలో
ఉపేక్ష
వైఖరి
అవలంబిస్తున్నారని
అయితే
అమెరికా
మాత్రం
మౌనంగా
వుండదని
బుష్
అన్నారు.