• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎగుమతుల లక్ష్యం 8 వేల కోట్ల డాలర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఎగుమతులను 8 వేల కోట్ల డాలర్లకుపెంచాలని లక్ష్యంగా ఎంచుకుంది. సగటు వార్షికపెరుగుదల 11.9 శాతంతో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు 15 సూత్రాల మధ్య కాలిక ఎగుమతుల వ్యూహంలో తెలిపారు. ఈ వ్యూహాన్ని వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్‌ బుధవారం విడుదల చేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో భారత ఉత్పత్తులు ధరలవిషయంలో పోటీ పడేందుకు రంగాల వారీగా 22 వస్తువులపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన చెప్పారు.
దేశం నుంచి ఎగుమతులను పెంచడానికి 220 సరుకులను గుర్తించినట్లు,వీటిని ప్రధాన వాణిజ్య భాగస్వాములు అమెరికా, యూరోపియన్‌ యూనియర్‌, జపాన్‌ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇది భారత ఎగుమతుల్లో 55 శాతం అవుతుందని ఆయన అన్నారు.

వచ్చే ఐదేళ్లలో వార్షిక పెరుగుదల 11.9 శాతం సాధించడం అసాధ్యమేమీ కాదని, గత దశాబ్దంలో వార్షిక ఎగుమతులపెరుగుదలను భారత్‌ పది శాతం సాధించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion