• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీనామాకు ప్రభాత్‌ కుమార్‌ నిర్ణయం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: వివాదంలో చిక్కుకున్న జార్ఖండ్‌ గవర్నర్‌ ప్రభాత్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను కేబినెట్‌సెక్రటరీగా వున్నప్పుడు ఇచ్చిన విందులకు ఖర్చులు పారిశ్రామికవేత్తలు భరించారని వచ్చిన ఆరోపణలను ఆయన లక్నోలోని రాజభవన్‌ నుంచి విడుదలయిన ప్రకటనలో ఖండించారు. తన గౌరవానికి, హుందాతనానికి భంగం కలిగించే పనులేవీ తాను చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తానని ఆయన చెప్పారు. తనకు వ్యతిరేకంగా మీడియా చేస్తున్న ప్రచారం పట్ల తాను నిస్పృహకు లోనయ్యానని ఆయన అన్నారు. తాను సివిల్‌సర్వీసెస్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వచ్చిన వార్తలు తనను ఎంతో వేదనకు గురి చేశాయని ఆయన అన్నారు.

సోమవారంనాడే ప్రభాత్‌ కుమార్‌ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభాత్‌ కుమార్‌ ప్రిన్సిపల్‌సెక్రటరీ డి.ఎస్‌. ముఖోపాధ్యాయ్‌ ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X