• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతిపితకు ఘన నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ తో పాటు కొత్త ఢిల్లీలో పలు కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్‌ లోని బాపూ ఘాట్‌ వద్ద గాంధీజీకి ఘన నివాళులుఅర్పించారు. నగర మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, మంత్రులువిజయరామారాలు, శ్రీనివాస యాదవ్‌ తదితరులు సికింద్రాబాద్‌ లోని గాంధీవిగ్రహానికి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు.

కొత్తఢిల్లీలో గాంధీ వర్థంతి సందర్భంగా జాతిపితకు ఘన నివాళులుఅర్పించారు. రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌, ప్రధాని వాజ్‌పేయి, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ తదితరులు గాంధీజీకి నివాళులుఅర్పించారు. ఈ సందర్భాంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X