వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాపై మరిన్ని దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః అమెరికాపై అల్‌ఖైదా తీవ్రవాదులు మరిన్ని దాడులు జరిపే అవకాశం వున్నదని అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ ఫెల్డ్‌ హెచ్చరించారు. అమెరికాపై, విదేశాల్లోని అమెరికా కీలక స్థావరాలపై, అమెరికా పౌరులపై దాడులకు అల్‌ఖైదాతీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టుగా తమకు సమాచారం అందినట్టు ఆయన చెప్పారు.

మరిన్ని దాడులకు అల్‌ఖైదా కుట్ర పన్నుతున్నట్టుగా ఎఫ్‌బిఐ వెల్లడించిన నేపథ్యంలో రమ్స్‌ఫెల్డ్‌ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇదిలా వుండగా గతఅక్టోబర్‌లో గల్ఫ్‌కు చెందిన అల్‌ జజీరా టీవీ ఛానెల్‌కు అల్‌ఖైదా నేత ఒసామాబిన్‌ లాడెన్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ కాసెట్‌ను చేజిక్కించుకున్న సిఎన్‌ఎన్‌అందులోని ముఖ్యాంశాలను ప్రసారం చేసింది. ఇంటర్వ్యూలో ఆఖరు ఊపిరి వున్నంతవరకు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతామని లాడెన్‌ హెచ్చరించారు. తమ నెట్‌వర్క్‌ అమెరికా లోలోపలికి చొచ్చుకుపోయినట్టుగా కూడా ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X