అధిష్టానానికి మైసూరా లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌ః సిఎల్‌పి కార్యదర్శి పదవినుంచి ఉద్వాసనకు గురైన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ ఎంవి మైసూరారెడ్డి అధిష్టాన వర్గానికి ఒక లేఖ రాయనున్నట్టుగా చెప్పారు. తాను ఏ నేరం చేయలేదని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కూడా ప్రయత్నించలేదని మైసూరారెడ్డి చెప్పారు.
    వివరణ కూడా తీసుకోకుండా తనను సిఎల్‌పి పదవినుంచి తొలిగించడం చాలా బాధ కలిగిస్తున్నదని ఆయన వెల్లడించారు. ఈవిషయంలో తన వివరణను పార్టీ అధిష్టాన వర్గానికి పంపనున్నట్టుగా ఆయన వెల్లడించారు. స్థానిక నాయకులువిన్నా వినకున్నా పార్టీ అగ్రనాయకులకు తన వాదన తెలియజెప్పడం తన విధి అని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న అంతర్గత పరిణామాల నేపథ్యంలో పార్టీలోని అసమ్మతి గ్రూప్‌లు ఆయనకు సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కోట్లవిజయభాస్కర్‌రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి శుక్రవారం నాడు మైసూరారెడ్డిని కలిసి మంతనాలు జరిపారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more