వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా తెగని నిమ్స్‌ సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గత మూడు వారాలుగా కొనసాగుతున్న నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్ల సమ్మె ఇంకా తెగలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరితే ఫీజు తగ్గింపు వ్యవహారాన్ని పరిశీలిస్తామని నిమ్స్‌ యాజమాన్యం ఇచ్చిన హామీని రెసిడెంట్‌ డాక్టర్లు తిరస్కరించారు.

ఇలాంటి మెలికలను తాముఅంగీకరించమని వారు స్పష్టం చేశారు. ఎన్ని రకాల అణిచివేత విధానాలకు పాల్పడినా తమ డిమాండ్‌ పరిష్కారమయ్యే వరకు సమ్మెవిరమించేది లేదని వారు విస్పష్టంగా ప్రకటించారు. నిమ్స్‌ సమ్మె నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇదిలా వుండగా తమను టర్మినెట్‌ చేస్తున్నట్టుగా ఇళ్లకు టెలీగ్రామ్‌లు ఇవ్వడాన్ని ఖండిస్తూ రెసిడెంట్‌ డాక్టర్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌తో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఈ టెలిగ్రామ్‌ వల్ల ఒక రెసిడెంట్‌ వృద్ధ తల్లితండ్రులుటెన్షన్‌కు లోనై అస్వస్థతకు గురైనట్టుగా వారు ఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X