వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌సైంటిస్టుకు అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శాస్త్రపరిశోధనా రంగంలో విశేష కృషికి గుర్తింపుగా ఇచ్చే జి.డి. బిర్లా అవార్డు హైదరాబాద్‌ శాస్త్రవేత్తకు లభించింది.

హైదరాబాద్‌లోని డిఎన్‌ఎ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నొస్టిక్స్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సయ్యద్‌ ఇ. హస్నేయిన్‌కు ఈ అవార్డనుకె.కె. బిర్లా ఫౌండేషన్‌ బుధవారం ప్రకటించింది.అవార్డు కింద లక్షన్నర రూపాయల నగదు అందజేస్తారు.స్వదేశంలో వుంటూ పని చేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. 2001 సంవత్సరానికి ఈ అవార్డు పొందిన హస్నేయన్‌ మలేరియా, టీబీ వ్యాధుల పరాన్న జీవులను ఎదుర్కునే వ్యాధి నిరోధక విధానాలను రూపొందించారు. ఆయనపరిశోధనా పత్రాలు దాదాపు వందకు పైగా అంతర్జాతీయసైన్స్‌ మ్యాగజైన్లలో అచ్చయ్యాయి. 1954లో జన్మించిన ఈ శాస్త్రవేత్త ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూవిశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్‌డి పట్టా పొందారు. కెనడా, అమెరికాలలో వైద్య రంగంలోపరిశోధనలు చేశారు. ఆ తర్వాత భారత్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ స్టాఫ్‌సైంటిస్ట్‌గా నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X