వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాయర్‌ పనిచేయరు: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ: ఐపిఎస్‌ ఆఫీసర్‌ వి.పి.బి. నాయర్‌ పని చేయరని హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఐపిఎస్‌ అధికారుల బదిలీకి ఆయా అధికారుల సమర్థతే ప్రామాణికమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై నాయర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

సమర్థత ఉన్న వాళ్లను, పని చేసే వాళ్లను మాత్రమే ప్రభుత్వం తన వద్ద వుంచుకుంటుందని,మిగతా వాళ్లను వేరే చోటికి బదిలీ చేస్తుందని, నాయర్‌ పని చేయడని మంత్రి చెప్పారు. నాయర్‌ ప్రకటనలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయర్‌విమర్శలపై స్పష్టమైన సమాధానాలను ప్రభుత్వం ఇవ్వబోతోందని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిపీపుల్స్‌వార్‌ నక్సలైట్ల చర్చల ప్రతిపాదనలపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X