వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ కేసు: పిటిషన్‌ నిరాకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జయలలితను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్‌ వేసేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అనుమతి నిరాకరించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జయలలిత నియామకం చెల్లదని గత ఏడాదిసెప్టెంబర్‌ 21వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పును పునఃసమీక్షించాలని, ఆమెను తిరిగి పదవిలో నియమించాలని ఎస్‌. సుబ్బారావు అనే న్యాయవాదికోరారు. రాజ్యాంగ నిబంధనలను సుప్రీంకోర్టు సరిగా అన్వయించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పిటిషన్‌ వేసేందుకు అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఎస్‌.పి. బరూచా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకీభవించలేదు. పటిషన్‌ వేసేందుకు మంగళవారం సాయంత్రం అనుమతి నిరాకరించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X