వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాతీరంలో ఉత్సవ కోలాహలం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ టూరిజం ను అభివృద్ధి చేసే లక్ష్యంతో తలపెట్టిన కృష్ణా ఉత్సవాలను గురువారం ప్రారంభించింది. బందరు, మంగినపూడి బీచ్‌, దివిసీమ,విజయవాడల్లో గురువారం నాడు ఏకకాలంలో ఈ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, వాణిజ్యపన్నుల శాఖ మంత్రివిజయరామారావు తదితరులు కృష్ణా ఉత్సవాల ప్రారంభోత్సవంలా పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కళా సంస్కృతీ వైభవాలను చాటిచెప్పే పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.విద్యుత్‌ దీపాల కాంతులు, నోరూరించే వంటకాల స్టాల్స్‌, కొండపల్లి బొమ్మల సోయగాలు, కూచిపూడి నృత్యలహరులతో కృష్ణాతీరం ఉత్సవ కోలాహలంతో పులకరించిపోయింది. వేలాది మంది ప్రజలు కృష్ణా ఉత్సవాలకు తిరణాలలా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎడ్లపందాలు, కోలాటాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలనువిద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసయాదవ్‌ కష్ణానదిలో వున్న భవానీ ఐలాండ్‌ ను సందర్శించారు. 130 ఎకరాలవిస్తీర్ణంలో వున్న ఈ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X