వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్‌ ...బచ్చా అంటున్న లాలూ!

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నాః అమితాబ్‌ బచ్చన్‌ నా ముందు ఓ బచ్చాగాడు.... ఇంతమాట అనాలంటే ఎంత ధైర్యం వుండాలి. అయితే బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ మాత్రం అమితాబ్‌ కంటే నాకే గ్లామర్‌ ఎక్కువ అని ఢంకాబజాయించి చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో సమాజ్‌ వాది పార్టీకి అమితాబ్‌ మద్దతు పలుకుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ కోసం లాలూ యు.పి.లో ప్రచారం చేసేందుకు శుక్రవారం బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అమితాబ్‌ నాకో పోటీయా.......? అని చెప్పి విలేకరులకు షాక్‌ ఇచ్చారు.

ఓటర్లను ఆకర్షించేందుకుఅమితాబ్‌ దగ్గర ఏంతైనా గ్లామర్‌ వుండొచ్చు.... అయితే ఎన్నికల రాజకీయంలో గెలిచే సత్తా రాజకీయ వేత్తలకే వుంటుందని లాలూ అన్నారు. శుక్రవారం నుంచి లాలూ కాంగ్రెస్‌ పార్టీ తరపున యు.పి.లో ప్రచారం చేయబోతున్నారు. ఇటువంటి సంచలనాత్మక ప్రకటనలు చేసే లాలూ ప్రచారం వల్ల కాంగ్రెస్‌ లాభపడుతుందో.... నష్టపోతుందో వేచి చూడాలి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X