వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలిక్కి రాని మజ్లీస్‌, కాంగ్రెస్‌ చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ పదవులవిషయంలో కాంగ్రెస్‌, మజ్లీస్‌ల మధ్య చర్చలు ఒక కొలిక్కి రాలేదు. అయితే, ఈ పదవులను రొటేషన్‌ పద్ధతిలో పంచుకోవాలని మాత్రం ఇరు పార్టీల మధ్య ఒక ప్రాథమిక అవగాహన కుదిరింది.

ఇరు పార్టీలు కలిస్తే డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ పదవులను చేజిక్కించుకునే అవకాశం వుంది. దీంతో అవగాహనకు ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల నాయకులు గురువారంనాడు నగర పాలక సంస్థ కమిషనర్‌ మొహంతీని కలిశారు. హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ప్రమాణం చేయడానికి ఈ పార్టీలు రెండు నిరాకరించాయి. మేయర్‌గా తీగల కృష్ణారెడ్డి లలిత కళాతోరణంలో ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మజ్లీస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను కమిషనర్‌కువివరించారు.

డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ పదవులవిషయంలో తమకు, మజ్లీస్‌కు మధ్య జరుగుతున్న చర్చలు పూర్తి కాలేదని కాంగ్రెస్‌ నాయకుడుపి. జనార్ధన్‌ రెడ్డి చెప్పారు. చర్చలు ఇంకా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X