వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డాక్టర్లకు విధిగా గ్రామీణసేవః మంత్రి
హైదరాబాద్ః ప్రభుత్వసేవల్లో చేరే వైద్యులు విధిగా మూడేళ్ళ పాటు గ్రామీణప్రాంతాల్లో వైద్యం చేయాలని ఈ మేరకు త్వరలో ఓ చట్టం తీసుకువస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాథానంగా మంత్రి ఈవిషయం వెల్లడించారు.
ఇందుకు వైద్య మంత్రి స్పందింస్తూ వైద్యులందరూ విధిగా మూడేళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోసేవలందించే విధంగా ఓ చట్టం తీసుకు వస్తున్నామన్నారు. విధుల్లో చేరని వైద్యులను తొలగిస్తున్నామని కూడా నాగం చెప్పారు.
Comments
Story first published: Monday, February 25, 2002, 23:53 [IST]