వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 2న జయ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడియంకె నేత జయలలిత మార్చి 2వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారు. ఐదు నెలల తర్వాత ఆమె తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని ఆమె చేపడుతున్నారు.

సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని, మంత్రివర్గంలో చేర్చుకునే వారిపేర్ల జాబితాను తనకు అందజేయాలని గవర్నర్‌ పి.యస్‌. రామమోహన్‌ రావు జయలలితకు సూచించినట్లు రాజభవన్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

జయలలిత మార్చి 2వ తేదీన మద్రాసు యూనివర్శిటీసెంటనరీ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆండిపట్టి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయిన తర్వాత జయలలితను అన్నాడియంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ ఐదు రోజులు శుభకరమైనవి కావనే ఉద్దేశంతో ఆమె ప్రమాణస్వీకారం తిథిని ఆలస్యంగా పెట్టుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X