వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుసినీ నటి ప్రత్యూష ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః వర్థమాన తెలుగు, తమిళ సినీనటి ప్రత్యూష శనివారం ఆత్మహత్య చేసుకుంది.స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందిన ప్రత్యూష ప్రియుడు సిద్దార్థరెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ప్రత్యూష చనిపోగా ఆమె ప్రియుడుమాత్రం ప్రాణాలతో బతికిబయటపడ్డాడు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రత్యూష ఇటీవలే తెలుగు, తమిళ సినీ రంగాల్లో నిలదొక్కుకుంటున్నది. ఇంజనీరింగ్‌ చదువుతున్న సిద్దార్థరెడ్డితో ప్రేమలో పడింది.వీరి పెళ్ళికి ప్రత్యూష తల్లిదండ్రులు అంగీకరించినా అబ్బాయి తరపు వారుఅంగీకరించలేదు. దీంతో తమ ప్రేమవిఫలం అవుతుందనే భయంతో శనివారంరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరిద్దరినీ హైదరాబాద్‌ లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యూష ఆదివారం మధ్యాహ్నం మరణించింది. సిద్దార్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రత్యూష మరణం కూడా సినిమాటిక్‌ గానే జరగడంవిశేషం. శనివారం రాత్రి కూల్‌ డ్రింక్‌ లో పురుగుల మందు తాగిన సిద్దార్థ, ప్రత్యూషకు పురుగుల మందు తాగాక ప్రాణాలపై ఆశ పుట్టింది. దీంతో ఇద్దరూ కారులో కేర్‌ ఆస్పత్రికి వచ్చి స్పృహ కోల్పోయారు. వైద్యులువీరి పరిస్థితి గమనించి చికిత్స ప్రారంభించినా ప్రత్యూషను కాపాడలేక పోయారు. ఆకాష్‌ తో కలిసి నటించిన ఇదేంఊరురా.... బాబూ చిత్రం విడుదల కావాల్సి వుంది. తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ప్రస్తుతం ఈమె నటిస్తున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X