వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యకు పారామిలటరీ దళాలు

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నోః అయోధ్యలో రామాలయ నిర్మాణానికివిశ్వహిందూ పరిషత్‌ సన్నాహాలు ప్రారంభించడంతో సుమారు రెండు వేల మంది పారామిలటరీ దళాలను అక్కడకు తరలించారు. ఆరు నూరైనా మార్చి 15 నుంచి నిర్మాణ సామగ్రినివివాదాస్పద స్థలానికి తరలిస్తామని విశ్వహిందూ పరిషత్‌ హెచ్చరించినవిషయం విదితమే. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సన్నాహ సూచనగా సోమవారం నుంచివిశ్వహిందూ పరిషత్‌ హోమాలు నిర్వహిస్తున్నది. ఈ వ్యవహారాలన్నింటినీ ప్రధాని వాజ్‌పేయి సారధ్యంలో సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

వివాదాస్పద స్థలం వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించడంతో పాటు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రెండువేల పారామిలటరీ దళాలను రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యకు తరలించింది.

1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేత సందర్భంగా కనీవినీ ఎరుగుని రీతిలో మత ఘర్షణలు చెలరేగినవిషయం విదితమే. మార్చి 15 నుంచి రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామనివిశ్వహిందూ పరిషత్‌ హెచ్చరించడం, అయోధ్యకు ఇప్పటికే 15 వేల మంది చేరుకోవడంతో ముందు జాగ్రత్తచర్యగా భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికి రెండు వేల పారామిలటరీ దళాలను తరలించగా త్వరలో మరిన్న దళాలను తరలించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ అధికారులు చెప్పారు.

ఆలయనిర్మాణం నిర్విఘ్నంగా జరిగేందుకు హోమాలు నిర్వహిస్తుట్లువిశ్వహిందూ పరిషత్‌ నేతలు చెప్పారు. సోమవారం నుంచి వందరోజుల పాటు నిరాఘాటంగా హోమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే అయోధ్య చేరుకున్న వారితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది రామభక్తులు మార్చి 15 నాటికి అయోధ్య చేరుకోనున్నారని కూడావిశ్వహిందూ పరిషత్‌ నేతలు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X