వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్మినార్‌ బ్యాంక్‌ పైఅసెంబ్లీలో రభస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చార్మినార్‌ బ్యాంక్‌ లో లక్ష రూపాయలలోపు డిపాజిట్‌ చేసిన ఇన్వెస్టర్లకు ఆ డబ్బు తిరిగి ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చార్మినార్‌ బాంక్‌ చైర్మన్‌ ఆత్మహత్యా యత్నం, ఆ బ్యాంక్‌ శాఖల వద్ద ఇన్వెస్టర్లపై లాఠీచార్జి జరిగినఅంశాలు మంగళవారం అసెంబ్లీలో రభసకు దారితీశాయి.కృషి, శ్యావ్య బ్యాంకులు ఇన్వెస్టర్ల నెత్తిన శఠగోపంపెట్టిన వెంటనే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్లయితే చార్మినార్‌ బ్యాంక్‌ మూతపడి ఇలా 400 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లేది కాదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థఅస్తవ్యస్తంగా తయారైనప్పటికీ ప్రభుత్వం మౌనజపం చేస్తున్నని ప్రతిపక్ష నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డివిమర్శించారు. ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్న సహకార బ్యాంకులకు అధికార పార్టీ రక్షణ కల్పిస్తున్నదని ఆయనవిమర్శించారు. చార్మినార్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఆగాను ముఖ్యమంత్రి ఇటీవలే వక్ఫ్‌ బోర్డు సభ్యుడిగా నియమించారని వై.ఎస్‌ దుయ్యబట్టారు. చంద్రబాబు సారధ్యంలో ఆంధ్రరాష్ట్రం దొంగలరాజ్యంగా మారిందనివిమర్శించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చార్మినార్‌ బ్యాంక్‌ లో లక్ష రూపాయలలోపు పొదుపు చేసుకున్న వారికి డిపాజిట్లు తిరిగి ఇప్పించే ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈఅంశంపై వాయిదా తీర్మానానికి ప్రతిపక్షాలు పట్టుపట్టగాస్పీకర్‌ తిరస్కరించారు. ప్రభుత్వం ఈ అంశపై ఓ ప్రకటన చేస్తుందనిస్పీకర్‌ చెప్పడంతో ప్రతిపక్షాలు శాంతించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X