వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌లో కొత్త ఫ్రంట్‌ ప్రభుత్వం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్‌: మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త ఫ్రంట్‌ ఏర్పాటయింది. కాంగ్రెస్‌, సిపిఐ, మణిపూర్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ కలిసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు ఈ నాలుగు పార్టీలు కలిసి సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పిహెచ్‌. పరిజత్‌ సింగ్‌ చెప్పారు. అత్యధిక సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్‌ ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తుంది.

అరవై సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ 15, మణిపూర్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరు, సిపిఐ ఐదు, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మూడు సీట్లు గెల్చుకున్నాయి. ఎఫ్‌పిఎం 12, బిజెపి నాలుగు, సమతా పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులకు మూడు స్థానాలు దక్కాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X