వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త బడ్జెట్‌ లో 16 ఇంటర్‌ సిటీరైళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల మధ్య తిరిగే 16 ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌ లను జనశతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ ల పేరిట రైల్వే శాఖ మంత్రి నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ 16 రైళ్లు ప్రస్తుతం శతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ లో వున్న సౌకర్యాలను కలిగివుంటాయని, ప్రత్యేకంగా రూపొందించిన సెకండ్‌ క్లాస్‌ చైర్‌ కార్‌ వసతి కూడా ఈ రైళ్ళలో వుంటాయని నితీష్‌కుమార్‌ ప్రకటించారు.

16 ఇంటర్‌ సిటీ రైళ్ళ వివరాలుః
1. మడ్‌ గావ్‌ - ముంబయ్‌
2. గౌహతి - దిమాపూర్‌
3. రాఘర్‌ - రాయ్‌ పూర్‌ - దుర్గ్‌
4. అహ్మదాబాద్‌ - భుజ్‌
5. టాటానగర్‌ - రాంచి
6. బెంగుళూరు - హుబ్లి
7. ఎర్నాకులం - త్రివేండ్రం
8. కోట - నిజాముద్దీన్‌
9. భువనేశ్వర్‌ - హౌరా
10. డెహ్రాడూన్‌ - న్యూఢిల్లీ
11. హౌరా - మార్డా టౌన్‌
12 వారణాసి - లక్నో
13. చండీఘర్‌ - న్యూఢిల్లీ
14. చెన్నై - విజయవాడ (వయా గూడూరు)
15. హబీబ్‌ నగర్‌ - జబల్‌ పూర్‌
16. కతిహార్‌ - పాట్నా

ఇవి కాక మరో 25 కొత్త రైళ్ళను మంత్రి ప్రకటించారు. దుర్గ్‌ - బెంగుళూరు(వయా. గోండియా, చందాఫోర్ట్‌) - సింకింద్రాబాద్‌ మధ్య నడిచే రైలు వీటిలో ఒకటి. కొత్త రైళ్ళలో ఇదొకటే ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X