న్యూయార్క్ః లండన్ నుంచి న్యూయార్క్ బయలు దేరిన ఒక విమానంలో టెర్రరిస్టు అనుమానితుడు ఒకరు వున్నట్టుగా అందిన సమాచారం ఉత్తదేనని వెళ్లడి కావడంతో హైడ్రామాకు తెరపడింది. తొలుత లండన్లోని హిత్రో విమానాశ్రయంలోని ఒక అధికారి ఎయిర్ ఇండియా విమానంలో వున్న ఒక పాసింజర్ ఎఫ్బిఐ నిషిద్ధ జాబితాలో వున్నట్టుగా అధికారులకు సమచారం అందిచడంతో ఈ డ్రామా ప్రారంభమైంది.
సమాచారంఅందడంతోనే ఎఫ్బిఐ అప్రమత్తమైంది. విమానం లాండ్అయిన వెంటనే అనుమానితున్ని అదుపులోకి తీసుకునేందుకు ఎఫ్బిఐ అధికారులు న్యూయార్క్విమానాశ్రయంలో మొహరించారు. మరో వైపు ఈవిమానాన్న వెన్నంటి కెనడా, అమెరికాకు చెందినఫైటర్ విమానాలు కూడా బయలుదేరాయి. ఎయిర్ ఇండియావిమానంలోని ప్రయాణికులకు అనుమానం రాకుండా దూరం నుంచి ఈ రెండుఫైటర్ విమానాలు వెంబడించాయి. సినిమా ఫక్కీలో జరిగిన ఈ హైడ్రామాకువిమానం న్యూయార్క్ చేరుకున్న తర్వాత గానీ తెరపడలేదు. సదరు అనుమానిత ప్రయాణికుణ్ణివిమానం తిగిన వెంటనే ఎఫ్బిఐ అధికారులు తీసుకువెళ్లి ఇంటరాగేట్ చేయగా అతనేపాపం తెలియని అమాయకుడని వెల్లడయింది.