చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలో తమిళనాడు కొత్త మంత్రివర్గం ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది. పాతవారు ఆరుగురికి ఉద్వాసన పలికి తొమ్మిది కొత్త మొహాలకు స్థానం కల్పిస్తూ తన కొత్త కేబినెట్ వివరాలను రాజ్‌భవన్‌కు జయలలిత అందజేశారు.
ఊహగానాలకుస్వస్తి చెబుతూ గద్దె దిగుతున్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు కొత్త మంత్రివర్గంలో నెంబర్ టూ స్థానాన్ని కల్పిస్తూ పిడబ్లుడి తోపాటు పలు ఇతర శాఖలను కూడాఅప్పగించారు. కొత్త మంత్రివర్గంలో జయతో సహా మొత్తం 27 మంది వుంటారు. సాధారణంగా ముఖ్యమంత్రులు అట్టేపెట్టుకునే అవినీతి నిరోధక శాఖను కూడా పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. హోం, పోలీసు, సాధారణ పరిపాలన విభాగాలు మాత్రం జయచూస్తారు.