అహ్మదాబాద్ఃగుజరాత్ హింసాకాండపై రగిలిన ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నాడు వాయిదా పడ్డాయి. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో అధికార ప్రతిపక్ష సభ్యులకు మధ్య గొడవ జరిగింది.
గుజరాత్లో కొనసాగుతున్న నరమేధాన్ని నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలువిఫలమయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డగించారు. ఉభయ సభలు ఉదయం రెండు గంటల పాటు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం సభ మళ్లీ సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభస్పీకర్ బాలయోగి సభను ఇవ్వాళ్లటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి కనిపించింది. సభాపతి స్థానంలో వున్న ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ చాలాసేపు సభ్యులను సముదాయించడానికి ప్రయత్నించారు.అయినా సభ్యులు ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభ మధ్యలోకి దూసకు రావడంతో సభను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.