అహ్మదాబాద్‌ః
గుజరాత్
అగ్నిగుండంగా
మారింది.
ఘర్షణల్లోగురు,
శుక్రవారాల్లో
200
మందికి
పైగా
మరణించారు.
అహ్మదాబాద్
లోనే
120
మంది
మరణించారు.సైన్యం
రంగంలోకి
దిగినప్పటికీ
పరిస్థితిలో
మార్పురాలేదు.
37
పట్టణాల్లో
కర్ఫ్యూ
విధించారు.
కనిపిస్తే
కాల్చివేత
ఉత్తర్వులు
జారీ
చేశారు.
అహ్మదాబాద్
లో
అల్లరిమూకలపై
పోలీసులు
కాల్పులు
జరపడంతో
ఏడుగురు
మరణించారు.
అహ్మదాబాద్
లో
కొన్ని
కాలనీలుఅగ్ని
గోళాల్లా
మారాయి.
దగ్ధమౌతున్న
ఇళ్ళు....
హాహాకారాలు.....
కాల్పులు,పెట్రోల్
బాంబుల
విస్ఫోటనాలతో
గుజరాత్
గజగజలాడుతున్నది.
రక్షణ
మంత్రి
జార్జ్
ఫెర్నాండెజ్‌స్వయంగా
పరిస్థితిని
సమీక్షిస్తున్నారు.
అహ్మదాబాద్‌లో
అనేక
చోట్ల
మైనార్టీ
మతానికి
చెందిన
వారి
ఇళ్లను
తగులబెట్టారు.
ఈ
దహనకాండలోనే
కనీసం
40
మంది
సజీవదహనంఅయినట్టుగా
చెబుతున్నారు.
బరోడా,
భరూచ్
పట్టణాల్లో
కూడాసైన్యాన్ని
మొహరించి
కర్ఫ్యూ
విధించారు.
ఈ
హింసాకాండపై
దేశవిదేశాల్లో
కూడా
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
అవుతున్నది.
అమెరికా,
కెనడా
తీవ్ర
ఆందోళన
వ్యక్తం
చేశాయి.
ఈ
మతకల్లోలాలనుఅరికట్టేందుకు
భారత్
గట్టి
చర్యలు
తీసుకోవాలని
అమెరికావిజ్ఞప్తి
చేసింది.