లక్నోః
ఆర్మీ
రిక్రూట్‌మెంట్
క్యాంపు
వద్ద
గురువారం
నాడు
జరిగిన
ఒక
దుర్ఘటనలో
21
మంది
అభ్యర్ధులు
దుర్మరణం
పాలయ్యారు.
ఆర్మీలో
సెలెక్షన్
కోసం
వచ్చిన
ప్రకటన
మేరకు
శిబిరం
వద్దకు
పెద్ద
సంఖ్యలో
చేరుకున్న
అభ్యర్ధులు
ప్రధాన
ద్వారం
మూసివుండటంతో
పక్కనే
వున్న
మరో
గేటునుంచి
లోపలికి
ప్రవేశించేందుకు
ప్రయత్నించారు.
ఈ
సందర్భంగా
జరిగిన
తొక్కిసలాటలో
అక్కడే
వున్నసెప్టిక్
ట్యాంక్
పై
కప్పు
ఒక్కసారిగా
విరిగిపోయింది.
దాంతో
దాదాపు
50
మంది
అభ్యర్ధులుఅందులో
పడిపోయారని
అధికారులు
చెప్పారు.
వీరిలో
21
మంది
మరణించారని
మరో
20
మంది
తీవ్రంగా
గాయపడ్డారని
వారు
చెప్పారు.పైనున్నవారు
కొందరు
మాత్రమే
స్వల్పగాయాలతో
బయటపడ్డారు.
ఈ
దుర్ఘటన
గురించి
తెలిసిన
వెంటనే
పోలీసులు,ఫైర్
సర్వీసు
సిబ్బంది
అక్కడకు
చేరుకున్నారు.
ఇంకా
కొన్ని
మృతదేహాలను
వెలికితీయాల్సి
వున్నదని
అధికారులు
చెప్పారు.
ఈ
సంఘటన
రాష్ట్ర
వ్యాప్తంగా
తీవ్ర
దిగ్భ్రాంతి
వ్యక్తంఅయింది.
ఈ
సంఘటనపై
లోక్‌సభలో
కూడా
గురువారం
నాడు
తీవ్రస్థాయిలో
గొడవ
జరిగింది.
నాసిరకంసెప్టిక్
టాంకులు
నిర్మించిన
మాజీ
మంత్రి
లాల్‌జీ
టాండన్‌నుఅరెస్టు
చేయాలని
ఎస్‌పి
సభ్యులు
సభలో
డిమాండ్
చేశారు.సైనిక
ఉద్యోగాల
కోసం
ఆశతో
రిక్రూట్‌మెంట్
క్యాంప్‌కు
వెళ్లిన
యాభై
మంది
అమాయకులుసెప్టిక్
ట్యాంక్‌లో
పడి
దుర్మరణం
పాలు
కావడం
పట్ల
రెచ్చిపోయి
సభా
కార్యక్రమాలను
వారు
స్తంభింపజేశారు.