హైదరాబాద్:
అయోధ్యకు
రాష్ట్రం
నుంచి
బయలుదేరే
కరసేవకులను
అడ్డుకుంటామని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
అయోధ్యలో
ప్రతీకాత్మక
పూజకు
అనుమతించాలని
అటార్నీ
జనరల్
సోలి
సొరాబ్జీ
సుప్రీంకోర్టును
కోరడం
పట్ల
ఆయన
గురువారంవిలేకరుల
సమావేశంలో
అసంతృప్తి
వ్యక్తం
చేశారు.
ప్రభుత్వం
తనకు
చెప్పలేదని,
తానే
కోర్టుకు
ఆవిజ్ఞప్తి
చేశానని
సోలి
సొరాబ్జీ
అనడం
పట్ల
కూడా
ఆయన
అభ్యంతరం
తెలియజేశారు.
అలా
చెప్పడంసరైంది
కాదని
ఆయన
అన్నారు.
ప్రభుత్వం
తరఫున
మాట్లాడే
అటార్నీ
జనరల్
తనంత
తాను
ఆవిజ్ఞప్తి
చేయడం
ఏ
విధంగానూ
సరైంది
కాదని
ఆయన
అన్నారు.
అవసరమైతే
సమయం
తీసుకుని
ప్రభుత్వాన్ని
సంప్రదించి
కోర్టులో
తన
వాదననువినిపించాల్సి
వుండిందని
ఆయన
అభిప్రాయపడ్డారు.