లూథియానా: ధాన్బాద్ ఎక్స్ప్రెస్ రెండవ క్లాస్ కంపార్ట్మెంటులో పేలుడు సంభవించి ఇద్దరు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. లూథియానాకు 20 కిలోమీటర్ల దూరంలో గల దొరాహా వద్ద బుధవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.
గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళకరంగా వుంది. ఈ పేలుడు గల కారణాలు తెలియరాలేదని ఉత్తరరైల్వే జనరల్ మేనేజర్ కన్వల్జిత్ సింగ్ చెప్పారు. గాయపడినవారిలో 15 మందిని దయానంద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు.మిగతా 13 మందిని దోరాహలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.