• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సొరాబ్జీదే తప్పుః చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌ః అయోధ్య వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్‌ సొరాబ్జీ చేసిన వాదనను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టులో వాదించే ముందు సొరాబ్జీ ప్రభుత్వాన్ని సంప్రదించి వుంటేబాగుండేదని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంపై ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు, మిత్రపక్షాల్లో చెలరేగిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని వాజ్‌పేయిస్వయంగా గురువారం నాడు ప్రయత్నించారు. చంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ వైఖరినివివరించారు. ప్రధాని వివరణతో చంద్రబాబు సంతృప్తి చెందినట్టుగా కనిపించారు. సుప్రీం కోర్టులో సొరాబ్జీ చేసిన వాదన ఆయన సొంత చొరవతో చేసిందే తప్ప భూమిపూజకు అనుమతించాలన్న కోరిక వాజ్‌పేయి ప్రభుత్వానికి లేదని చంద్రబాబుఅన్నారు. అయోధ్య సమస్యను రాజకీయ పక్షాలు జఠిలంగా తయారు చేశాయని ఆయన దుయ్యబట్టారు. ఈ సమస్య కొత్తది కాదని ఏళ్లుగా నానుతున్నదని అన్ని రాజకీయ పక్షాలు తెలిసో తెలియకో,స్వార్ధానికో, పరార్ధానికో ఈ సమస్యను సంక్లిష్టంగా తయారు చేసిపెట్టాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఈ దశలో కూడా దీనినుంచి లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X