• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైపాల్‌ వ్యాఖ్యతో సభ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిపై కాంగ్రెస్‌ సభ్యుడు ఎస్‌. జైపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య లోక్‌సభ వాయిదాకు దారి తీసింది. అయోధ్యవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని ప్రధాని చెప్పిన అనంతరం జైపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యతో గొడవ చెలరేగింది. సభా కార్యకలాపాలు స్తంభించాయి.

జైపాల్‌ రెడ్డిచేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన జాతీయప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) సభ్యులు ప్రతిపక్షాలసభ్యుల వైపు దూసుకెళ్లారు. దీంతో సభరెండు గంటల పాటు వాయిదా పడింది. ప్రధాని ప్రకటనలపైవివరణలు కోరడానికి డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ సభ్యులకు అనుమతి ఇచ్చారు. మార్చి 15వతేదీన విహెచ్‌పి తలపెట్టిన ప్రతీకాత్మకపూజా వ్యూహం విషయంలో ప్రధాని ప్రకటనమబ్బులను తొలగించలేకపోగా ద్విగుణీకృతంచేస్తోందని జైపాల్‌ రెడ్డి విమర్శించారు. ప్రధానిముఖంపై వేసుకున్న ముసుగు తొలగిపోయిందనిఆయన వ్యాఖ్యానించారు. వాజ్‌పేయిలో ప్రస్తుతం హిందూత్వముఖం స్పష్టంగా చూడవచ్చునని ఆయన అన్నారు.

జైపాల్‌ రెడ్డి చేసిన కరుకైన వ్యాఖ్యతో అధికారపక్ష సభ్యులు ఆగ్రహం చెంది వెల్‌లోకి దూసుకుపోయారు.ప్రతిపక్షాల సభ్యుల వైపు దూసుకెళ్లే ప్రయత్నంచేశారు. సంయమనం పాటించాల్సిందిగా పార్లమెంటరీవ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. ఒక దశలోమహాజన్‌ మాజీ ప్రధాని చంద్రశేఖర్‌చెంతకు వెళ్లి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దనికోరారు. కాంగ్రెస్‌ ఉప నాయకుడు శివరాజ్‌ పాటిల్‌ వివరణఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని అధికార పక్ష సభ్యులుఅడ్డుకున్నారు. ఈ స్థితిలో సభ వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X