లక్నోలో ప్రమాదం: 21 మంది మృతి
లక్నో: లక్నోలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌సెంటర్‌లో సీవరేజ్ డ్రెయిన్‌లో పడి 21 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున సంభవించింది.ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారని అధికారులు చెప్పుతున్నారు. అయితే, మృతుల సంఖ్య 40 నుంచి 50 దాకా వుండచ్చునని అనధికార వర్గాల అంచనా. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.
ప్రమాదంతో ఆగ్రహం చెందిన యువకులు విధ్వంసానికి దిగారు. బ్రిడ్జి కూలిపోవడంతో ఆర్మి రిక్రూట్‌మెంట్‌కు వచ్చిన యువకులు డ్రైనేజీలో పడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం ఐదు, ఐదున్నర గంటల మధ్య జరిగింది.
మృతదేహాలను అన్నింటినీ వెలికి తీశారు. గాయపడిన ముగ్గురినిసైనిక ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి ప్రథమ చికిత్స చేసిపంపేశారు. మరణించివారి బంధువులకు సమాచారంఅందించడానికి పాలనా యంత్రాంగం, సైనిక అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నాయి. చాలా మంది పొరుగు జిల్లాల నుంచి వచ్చి వుంటారని భావిస్తున్నారు. రిక్రూట్‌మెంట్ పరీక్షలు ఇక్కడ జరుగుతూనే వుంటాయి.