• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్యసభకు ఆరుగురు నామినేషన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు, నలుగురు తెలుగుదేశం అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి.

రాజ్యసభ తెలుగుదేశం అభ్యర్థులు నలుగురు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభకు తెలుగు దేశం అభ్యర్థులుగా పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు లాల్‌జాన్‌ బాష, పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన ఆకారపు సుదర్శన్‌, చిత్తూరు జిల్లాకు చెందిన దుర్గ ఎంపికయ్యారు.

ఈ నలుగురి చేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రతిజ్ఞ చేయించారు. అన్ని సామాజిక వర్గాలను, ప్రాంతాలను దృష్టిలోపెట్టుకుని అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీకి చెందని మేధావులకు రాజ్యసభ టికెట్లు ఇవ్వాలని తనకు ఉన్నదని, అయితే కొన్ని కారణాల వల్ల ఈసారి పార్టీవారికే టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇక ముందు పార్టీకి చెందని మేధావులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. రాజ్యసభ టికెట్లు ఆశించినమిగతావారి సేవలను వారి సమర్థత ఆధారంగా వాడుకుంటామనిఆయన చెప్పారు.

రాజ్యసభ కాంగ్రెస్‌ అభ్యర్థులు టి. సుబ్బిరామి రెడ్డి, నంది ఎల్లయ్యలు కూడా గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X