న్యూఢిల్లీః
అయోధ్యలో
మార్చి
15న
విహెచ్‌పి,
రామజన్మభూమి
న్యాస్
తలపెట్టిన
పూజలపై
విధించిన
నిషేధం
కేంద్ర
ప్రభుత్వం
సమీకరించిన
మొత్తం
భూమికి
వర్తిస్తుందని
సుప్రీంకోర్టు
గురువారం
నాడు
వివరణ
ఇచ్చింది.
బుధవారం
నాడు
ఇచ్చిన
తీర్పులో
కేంద్ర
అధీనంలో
వున్న
కోట్
రామచంద్ర
గ్రామంలోని
రెండు
ప్లాట్లలో
పూజలు
నిర్వహించకుండా
నిషేధం
విధిస్తూ
కోర్టు
ఉత్తర్వులు
జారీ
చేసింది.
అయితే
కొన్ని
పత్రికల్లో
కోర్టు
తీర్పును
ఉటంకిస్తూ
కేంద్రంస్వాధీనం
చేసుకున్న
67
ఎకరాల
భూమి
మూడు
గ్రామాల
పరిధిలోకివిస్తరించి
వున్నదని
మొత్తం
వంద
రెవెన్యూ
ప్లాంట్ల
కింద
ఈభూమి
విస్తరించి
వున్నదని
పత్రికలు
పేర్కొన్నాయి.
పత్రికలు
ఈ
వార్త
రాసే
సమయానికే
కోర్టు
తీర్పు
చెప్పిన
స్థలానికి
500
గజాల
దూరంలో
పూజలు
నిర్వహిస్తామని
విహెచ్‌పి
ప్రకటించింది.
దాంతో
బుధవారం
నాడు
తీర్పును
వెలువరించిన
ధర్మాసనమే
గురువారం
నాడు
సమావేశమై
అయోధ్యలో
కేంద్రం
భూసేకరణల
చట్టం
కింద
సేకరించి
మొత్తం
భూభాగానికి
తమ
నిషేధ
ఉత్తర్వులు
వర్తిస్తాయని
ప్రకటించింది.