వరంగల్‌ః
మాజీ
నక్సలైట్
నాయకుడు,
ట్రైబల్స్
లిబరేషన్
ఫ్రంట్
నేత
రామును
వరంగల్
పోలీసులు
అరెస్టు
చేశారు.
రాముతో
పాటు
ఆయన
కొరియర్
తిప్పిని
శ్రీను
కూడా
అరెస్టయ్యాడు.
వీరి
అరెస్టు
సందర్భంగా
ఆయుధాలను
కూడా
స్వాధీనం
చేసుకున్నట్టుగా
డిఎస్‌పి
వెంకట్రావ్
చెప్పారు.
రాము
గతంలో
చండ్రపుల్లారెడ్డి,
రామచంద్రన్
గ్రూప్‌లో
పనిచేశాడని
తర్వాతవీరన్న
గ్రూప్‌లో
వుంటూ
విడిపోయి
బెంగుళూరులో
టిఆర్‌ఎస్
నేత
ప్రకాషరావు
మరికొందరితో
కలసి
ట్రైబల్
లిబరేషన్
ఫ్రంట్
ఏర్పాటు
చేసినట్టుగా
డిఎస్‌పి
చెప్పారు.
టిఎల్‌ఎఫ్‌పేరుతో
ఈ
గ్రూప్
పెద్దఎత్తున
నిధులు
వసూలు
చేసిందని
అక్రమంగా
ఆయుధాలు
కొనుగోలు
చేసిందని
ఆయన
చెప్పారు.
జనశక్తి
నుంచి
బయటకొచ్చి
సొంత
గ్రూప్
ఏర్పాటు
చేసుకున్నవీరన్న
ఎన్‌కౌంటర్‌లో
ఇన్‌ఫార్మర్‌గా
వ్యవహరించాడని
రాముపై
ఆరోపణలు
వున్నట్టుగా
తెలిసింది.
ఈఅరెస్టులో
టిఆర్‌ఎస్
నేత
ప్రకాషరావు
పేరు
కూడా
బయటకు
రావడం
గమనార్హం.