వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలోనూ పోటోకు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీవ్రవాద నిరోధక బిల్లుకు చుక్కెదురైంది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓ చట్టబద్దమైన తీర్మానాన్ని ఆమోదించాయి.

ఈ తీర్మానంపై రాత్రి జరిగిన ఓటింగ్‌లో 113-98 ఓట్లతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా హోం మంత్రి అద్వానీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా సభ అదే తేడాతో తిరస్కరించింది.ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించడంతో ప్రభుత్వం ఇక వచ్చే మంగళవారం నాడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన సిఫారసును రాష్ట్రపతికి శుక్రవారం నాడు పంపిస్తున్నారు. ఈవిషయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ చెప్పారు. పోటో బిల్లు రాజ్యసభలో వీగిపోవడాన్నివిపక్షాలు ఘనవిజయంగా అభివర్ణించగా, ప్రభుత్వం మాత్రం ప్రజల పట్ల ద్రోహంగాపేర్కొంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X