వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి ప్రభుత్వ పోర్టల్‌ ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎపి ఆన్‌లైన్‌ పోర్టల్‌ బుధవారంనాడు ప్రారంభమైంది. దీన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌లోని జూబిలీహాల్‌లో ప్రారంభించారు.

రాష్ట్రంలోని 85 వేల ఎస్‌టిడి బూత్‌లను ఈ పోర్టల్‌కు తగిన విధంగా వాడుకుంటారు. ఇందులో వంద ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని, 350 దరఖాస్తు ఫారాలను పొందు పరుస్తారు. దరఖాస్తు ఫారాలను డవున్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కూడా వుంటుంది. ఈ పోర్టల్‌ సౌకర్యాలను మరింతవిస్తరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

వచ్చే విద్యాసంవత్సరం కోసం కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ఫారాలను పోర్టల్‌లో పొందు పరచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెల్లింపుల సదుపాయం, సమాచారవివరాలు, ఇంటరాక్టివ్‌ సౌకర్యం ఈ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోఅందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X