• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేలో ఎల్‌టిటిఇతోప్రభుత్వ చర్చలు

By Staff
|

కొలంబో: శ్రీలంక ప్రభుత్వంతో నేరుగా చర్చలకు జరపడానికి లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం(ఎల్‌టిటిఇ) అంగీకరించింది. శ్రీలంకలో శాంతి స్థాపనకు నార్వే చేస్తున్న కృషిలో ఎంతో ముందడుగు వేసినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి, ఎల్‌టిటిఇకి మధ్య చర్చలు మేలో జరుగుతాయని భావిస్తున్నారు.

మే మొదటి వారంలో ముఖాముఖి చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్లు రాజ్యాంగ వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్‌ జి.ఎల్‌.పీరిస్‌ చెప్పారు.

సంప్రదింపులకు సమయం వచ్చిందని ఇరు వర్గాలు అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నార్వే ప్రతినిధులు ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్‌తోను, మరో నేతఅంటన్‌ బాలసింగమ్‌తోనూ చర్చలు జరిపారు. ప్రస్తుతం అమలవుతున్న కాల్పులవిరమణ ఈ పరిమాణానికి దోహదం చేసిందనిపీరిస్‌ అన్నారు. చర్చలు ఎక్కడ జరిగేది తర్వాత తెలియజేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X