వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న మాయావతి ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) ఉపాధ్యక్షురాలు మాయావతి మే 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవం ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరుగుతుందని గవర్నర్‌ విష్ణు కాంత్‌ శాస్త్రి సోమవారం విలేకరులతో చెప్పారు.

బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి), భారతీయ జనతా పార్టీ (బిజెపి)ల మధ్య కుదిరినఅంగీకారం ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక సమన్వయ కమిటీ ఏర్పడుతుందని బిఎస్‌పి నేత మాయావతి చెప్పారు. ఈ కమిటీలో మిత్రులందరికీ ప్రాతినిధ్యం వుంటుందని బిజెపి కార్యాలయంలో ఏర్పాటయిన సంయుక్తవిలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. సంకీర్ణంలో ప్రధాన భాగస్వామిఅయిన బిజెపి తగినంత ప్రాతినిధ్యం వుంటుందని ఆమె చెప్పారు.

ప్రస్తుత మంత్రివర్గం గతంలో ఉన్నంత వుంటుందని, విధాన సభలో బలాలను బట్టి భాగస్వామ్య పక్షాలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని మాయావతి చెప్పారు.స్పీకర్‌ పదవి బిజెపికి ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ప్రతిపాదనేదీ లేదని, అదంతా మీడియా సృష్టేనని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X