వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడిని మార్చం: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించే ప్రశ్నే లేదని లోక్‌సభలో అభిశంసన తీర్మానం 30వ తేదీన చర్చకు వస్తున్న నేపథ్యంలో పునరుద్ఘాటించింది. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయికి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశం నేపథ్యంలో నరేంద్ర మోడిని తప్పిస్తారని వచ్చిన వార్తల్లో నిజం
లేదని బిజెపి అధికార ప్రతినిధి వి.కె. మల్హోత్రా సోమవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.

మోడి ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుందని పార్టీ వర్గాలంటున్నాయి.

గుజరాత్‌లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు, మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన వార్తలపై మల్హోత్రా ప్రతిస్పందిస్తూ ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్‌ఐఆర్‌లు) దాఖలు చేయకుండా నిందితులపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదని అన్నారు.రేప్‌లు జరిగినట్లు సహ్మత్‌ వంటి సంస్థలకు తెలిస్తే పోలీసులకు ఫిర్యాదులు చేయవచ్చునని ఆయన అన్నారు. గుజరాత్‌ ప్రతినిధులు కలిసినప్పుడు రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X