ఆదిలాబాద్:
ఆదిలాబాద్
జిల్లా
మందమర్రి
పట్టణంలోనిసి.ఇ.ఆర్.
క్లబ్
ప్రాంతంలో
శుక్రవారం
జరిగిన
ఎన్‌కౌంటర్‌లోపీపుల్స్‌వార్
గ్రూప్
ఎస్.జి.ఎస్.
కమాండర్
ఏలేటి
ధర్మయ్య
అలియాస్
కొండన్న
(30)
మరణించాడు.
బెల్లంపల్లి
అడిషనల్
ఎస్‌పివిజయ్
కుమార్
తెలిపిన
వివరాల
ప్రకారం-
పట్టణంలోని
ప్రముఖులపై
నక్సల్స్
దాడులు
చేస్తున్నట్లు
స్థానిక
ఎస్‌ఐ
బాలుజాదవ్‌కు
సమాచారంఅందింది.
దీంతో
ప్రముఖుల
ఇళ్ల
వద్ద,
బస్లీల్లో,
పట్టణ
శివారుల్లో
ఎస్‌ఐపెట్రోలింగ్
చేశారు.
బాలుజాదవ్
శుక్రవారం
ఉదయం
సిఇఆర్
క్లబ్
ప్రాంతంలోపెట్రోలింగ్
చేస్తుండగా
ముగ్గురు
నక్సల్స్
పోలీసులపై
కాల్పులు
జరిపారు.
పోలీసులు
ఎదురు
కాల్పులు
జరిపారు.
ఇద్దరు
నక్సల్స్
కాల్పులు
జరుపుతూ
పారిపోయారు.
పోలీసు
కాల్పుల్లో
ధర్మయ్య
మరణించాడు.