వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికీ దేశంకేస్పీకర్‌ ఛాన్స్‌ః బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః దివంగత లోక్‌ సభస్పీకర్‌ బాలయోగి సతీమణి విజయకుమారి అమలాపురం లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు దాదాపుఅంగీకరించారు. ఆమె కొంత సంశయించినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆమెకు పరిస్థితివివరించి ఒప్పించారు. బాలయోగి ఆశయాలు సాకారం పొందాలన్నా, తెలుగుదేశం పార్టీకి అమలాపురం నియోజక వర్గానికి మంచి జరగాలన్నామీరు అమలాపురం నుంచి పోటీకి ఒప్పుకోవాలని చంద్రబాబు ఆమెనుకోరారు. విజయకుమారి శనివారం సాయంత్రం చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. పోటీవిషయంలో తనకు రెండు రోజుల గడువుకావాలంటూ ఆమె ఊగిసలాట ధోరణి ప్రదర్శించారు.

అయితే 6 నుంచి నామినేషన్లపర్వం ప్రారంభం కానున్నందున ఇంకా ఊగిసలాట తగదని, తనపైవిశ్వాసం వుంచాలని చంద్రబాబు కోరడంతో విజయకుమారి కాదనలేని పరిస్థితి ఏర్పడింది. బాలయోగి సతీమణిని బరిలోకి దించితే కాంగ్రెస్‌ పార్టీ ఎవరినీ పోటీకి నిలబెట్టక పోవచ్చునని భావిస్తున్నారు. బాలయోగి నియోజక వర్గానికి చేసినసేవలు, సానుభూతి పవనాల కారణంగా విజయకుమారివిజయం తధ్యమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X