• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవినీతిపై చంద్రబాబు సమరభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైరదాబాద్‌ః అవినీతిని అంతం చేసేందుకు కలెక్టర్లు నడుం కట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అన్ని శాఖల్లో అవినీతిపెచ్చుమీరిపోతున్నదని ఇక అవినీతిని ఉపేక్షించేది లేదని ఆయన రెండురోజులుగా జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో భాగంగా శుక్రవారం చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. అవినీతిపై కలెక్టర్లకు జిల్లాల వారీగా నివేదికలు పంపిస్తామని వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో కలెక్టర్లదే భారమని చంద్రబాబు చెప్పారు.

అవినీతి నిర్మూలనకు చట్టపరంగా వున్న లొసుగులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పకడ్బందీగా చట్టాలను రూపొందించక పోతే ఎన్ని చర్యలు తీసుకున్నా అవినీతి నిర్మూలన సాధ్యం కాదన్నారు. జిల్లా కలెక్టర్లు అవినీతి నిర్మూలనకు అంకిత భావంతో కృషి చేయాలని ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X