శ్రీనగర్: కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన ఐదుగురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మరణించినవారిలో ఒకస్త్రీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పాకిస్థాన్ బలగాలు కాశ్మీర్ సరిహద్దుల్లోని గ్రామాలపై దాడి చేశాయి. ఈ దాడిలో కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా వుంది. పాక్ బలగాలు మోర్టార్లను, రాకెట్లను ప్రయోగించాయి. పాకిస్థాన్ బలగాలను తిప్పికొట్టడానికి భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో పాక్ బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరు దేశాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి.