• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌ అస్థిరతకు భారత్‌యత్నం: ముషార్రఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారత్‌ తమ దేశాన్నిఅస్థిర పరిచే ప్రయత్నం చేస్తోందని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ విమర్శించారు. తమ దేశంలో ఉగ్రవాదం తలెత్తి, విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఉగ్రవాదం ప్రపంచంలోని ఏ దేశంలోకి కూడా తమ దేశం నుంచి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటామని, ఇది తమ వైఖరి అని, దీనికి కట్టుబడి వుంటామని ఆయన వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పాకిస్థాన్‌లో భారత దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,పైగ పొరుగు దేశాలను నిందిస్తోందని ఆయన అన్నారు. సరిహద్దులో భారతదేశంపెద్ద యెత్తున బలగాలను మోహరించిందని, తనను, తన ప్రభుత్వాన్ని, పాకిస్థాన్‌నుఅస్థిర పరచడానికి యుద్ధ బెదిరింపులు చేస్తోందని ఆయనవిమర్శించారు.

భారత, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగితే తాము భారత్‌పై దాడికి దిగుతామని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్‌ రాడికల్స్‌ను అణచివేయాలనేవిజ్ఞప్తులను పాకిస్థాన్‌ పట్టించుకోవడం లేదనేవిమర్శలను ఆయన త్రోసిపుచ్చారు. కాశ్మీర్‌లోకి చొరబాట్లను అడ్డుకున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X