• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తీవ్రవాదుల దాడి: 8 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని మూడుసైనిక స్థావరాలపై దాడులు చేశారు. దోడాలోని జిల్లా పోలీసు లైన్స్‌పై, సొపోర్‌, కొకెర్నాగ్‌లలోని ప్రభుత్వ సంస్థలపై తీవ్రవాదుల దాడి చేశారు. ఈ సంఘటనల్లో ముగ్గురు భారత పోలీసులు మరణించారు. ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఒక తీవ్రవాదిని భారత బలగాలు పట్టుకున్నాయి.

పాకిస్థాన్‌ చొరబాటుదార్లుగా భావిస్తున్న తీవ్రవాదులు దోడా పోలీసు లైన్స్‌పై దాడి చేసి ఇద్దరు జవాన్లను చంపి లోనికి ప్రవేశించారు. మూడంతస్థుల భవనంలోకి ప్రవేశించి పోలీసులపై కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు.

ఆ తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు,స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రవాదులను ఎదుర్కున్నారు. దీంతోమిలిటెంట్లు రేషన్‌ స్టోర్‌లోకి చొరబడ్డారు. ఆ గదికిసైనికులు బోల్ట్‌ బిగించి రేషన్‌ స్టోర్‌కు నిప్పంటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X