వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగునీటి సంఘాలపై బాబు అసంతృప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సాగు నీటి సంఘాల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు నీటి సంఘాల అధ్యక్షుల రాష్ట్ర సమాఖ్య సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు.

సాగు నీటి సంఘాలు సమర్థవంతంగా పని చేసేలా వెంటపడతానని ఆయన చెప్పారు. రాష్ట్రసర్వతోముఖాభివృద్ధికి బాధ్యతాయుతంగా పని చేయాలని ఆయన సాగునీటి సంఘాల అధ్యక్షులకు ఉద్బోధించారు. జమాఖర్చులపై ఆడిట్‌ జరిగితేనే తిరిగి ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 82 శాతం నీటి సంఘాలు ఆడిట్‌ నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ఏం జరిగిందో చెప్పలేకోతే ఎందుకు పోటీ చేయాలని ఆయన నీటి సంఘాల అధ్యక్షులను అడిగారు. పెత్తనం కావాలి, కానీ బాధ్యతలు మాత్రం నిర్వహించరని ఆయన వారినుద్దేశించి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొత్త సాగు నీటి సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు, కొత్త ప్రాజెక్టులకు కూడా నీటి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X