వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధ నివారణే మాకోరిక: భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఆల్మాటీ/ న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించాలనే తాము కోరుకుంటున్నామని భారత్‌ సోమవారం రాత్రి స్పష్టం చేసింది. అమెరికాకు,బ్రిటన్‌కు ఇచ్చిన హామీ మేరకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ప్రకటించింది.

ప్రపంచం ఘర్షణ వైఖరికిస్వస్తి చెప్పాలని కోరుకుంటోంది. అందుకే తాము ప్రయత్నం చేస్తున్నాం. మేం ఘర్షణను నివారించాలనుకుంటున్నాం. జనరల్‌ ముషార్రఫ్‌ కొన్ని వాగ్దానాలు చేశారు. అమెరికా,బ్రిటన్‌, ఇతర మధ్యవర్తుల ద్వారా మాకు వాటిని చేరవేశారు అని భారత ప్రధాని ముఖ్య కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌మిశ్రా అన్నారు. ఆ వాగ్దానాలను అమలు చేస్తే వాటిని తాము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఇ. రఖ్మనోవ్‌,అఎn్ఘాన్‌ నేత హమీద్‌ కర్జాయ్‌లతో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జరిపిన చర్చల వివరాలను మీడియా ప్రతినిధులకువివరిస్తూ అన్నారు.

పాకిస్థాన్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించబోమని భారత్‌ న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. అణ్వస్త్రాల ప్రయోగంపై నమ్మకం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X