• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆరుగురు పాక్‌ సైనికుల మృతి

By Staff
|

జమ్మూ:పాకిస్థాన్‌ బలగాలు నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూనే వున్నాయి. వివిధసెక్టార్లలో ఆర్టిల్లరీ, మోర్టార్లను, ఇతర పేలుడు పదార్థాలను ప్రయోగిస్తూనే ఉన్నాయి.భారత్‌ సోమవారం జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు పాక్‌ సైనికులు మృతి చెందారు. పలు బంకర్లు ధ్వంసమయ్యాయి.

ద్రాస్‌, కార్గిల్‌, బాటాలిక్‌ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి మోర్టార్లను, ఆర్టిల్లరీని ప్రయోగిస్తున్నాయి. అయితే ఈ కాల్పుల్లో భారత్‌ వైపున ఏ విధమైన ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు.

మిగతా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ రేఖ వెంబడి పరిమితంగా మాత్రమే కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల ప్రభావం జమ్మూలోని పూంఛ్‌, నౌషేరా, మోలు, ఆర్‌.ఎస్‌.పురా, ఆర్నియా, రామఘర్హ్‌ సెక్టార్లపై ఉంది. రాజౌరీ జిల్లాలోని నౌషేరాసెక్టార్‌లో గల లామ్‌, ఝాంఘర్‌, కల్సియన్‌, కలాల్‌ ప్రాంతాల్లో పాక్‌ బలగాలు మోర్టార్లను ప్రయోగించాయి.
కథువా జిల్లాలోని కడ్యాల గ్రామం వద్ద పొదల్లో ఆదివారం ప్రారంభమైన కాల్పులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X