• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రానికి 600 ఐఐటి రాంకులు

By Staff
|

ఆల్మాటీ: సమస్యను ఎదుర్కోవడానికి భారత్‌, కజక్‌స్థాన్‌ ఉమ్మడి వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినప్పటికీ తీవ్రవాదాన్ని, మత ఉగ్రవాదాన్ని ఆసియా నుంచి తరిమేయాల్సి వున్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు.

వాజ్‌పేయి, కజక్‌ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్‌ నజర్‌బయేవ్‌ సమక్షంలో భారత్‌, కజక్‌లు రక్షణ, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారానికి రెండు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నజర్‌బయేవ్‌తో వాజ్‌పేయి విస్తృతంగా చర్చలు జరిపారు. భారత్‌ సమస్యలను, దక్షిణాసియాలో సీమాంతర ఉగ్రవాదాన్నిపెంచి పోషిస్తున్న తీరును కజక్‌ అధ్యక్షుడు పూర్తిగాఅర్థం చేసుకున్నారని భారత ప్రధాని వాజ్‌పేయివిలేకరులతో చెప్పారు.

అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే విషయంలో ఇరు దేశాలుఒకే దృక్పథంతో ఉన్నాయని, తీవ్రవాదంపై పోరుకు ఉమ్మడి వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ 16 దేశాల భద్రతా సమావేశం ఒక డిక్లరేషన్‌ను విడుదల చేస్తుందని ఆయన అన్నారు.
నజర్‌బయేవ్‌తో వాజ్‌పేయి 35 నిమిషాల పాటు ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య గలసైనిక సాంకేతిక సహకారం విక్రయదారు, కొనుగోలుదారు సంబంధాలు సాంకేతిక,పరిశోధన, అభివృద్ధి మార్పిడికి ఎదగాల్సిన అవసరం ఉన్నదని వాజ్‌పేయి అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇరు దేశాల అధిపతులు నాలుగు రంగాలను గుర్తించారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, సమాచార సాంకేతిక, ఫార్మాస్యూటికల్స్‌, లఘు పరిశ్రమల రంగాల్లో ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారంపెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X